గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన మరో విధానాన్ని రద్దు చేసింది చంద్రబాబు- పవన్ కూటమి సర్కార్. అదే- రివర్స్ టెండరింగ్. వేల కోట్ల రూపాయలతో కార్యకలాపాలను నిర్వహించే జల వనరుల మంత్రిత్వ శాఖలో దుబారాను అరికట్టడానికి, ఆర్థిక నియంత్రణ కోసం జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానం ఇది. రివర్స్ టెండరింగ్‌ను అమలు చేస్తూ 2019 ఆగస్టు 16వ తేదీన జారీ అయిన జీవో నంబర్ 67ను రద్దు చేసింది. దాని స్థానంలో పాత విధానం ఆన్‌లైన్ ఇ-ప్రొక్యూర్‌మెంట్ వ్యవస్థను అనుసరిస్తామని తెలిపింది.