AP: వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై గెలిచి, 2024లో కూటమి అభ్యర్థి అంజిబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. గత కొద్ది రోజులుగా వైసీపీ పిలుపునిచ్చిన ఎలాంటి కార్యక్రమంలోనూ గ్రంధి శ్రీనివాస్ పాల్గొనలేదు. దాంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.