ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు మించిన మరో భవన నిర్మాణానికి దుబాయ్‌లో ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ‘థెర్మె దుబాయ్’ పేరుతో జబీల్ పార్క్‌లో మరో ఎత్తైన భవనాన్ని నిర్మించబోతున్నామని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్‌దాన్‌బిన్ మహమ్మద్ తెలిపారు. 2028లో ఓపెనింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. 2 బిలియన్ల దీరమ్స్‌తో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు.