TG: ఆర్ధిక ఇబ్బందులతో మరో రియల్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లికి చెందిన కీలుకత్తి నరసింహ గౌడ్(45) రియల్ ఎస్టేట్ వ్యాపారి గత సంవత్సర కాలంగా రియల్ ఎస్టేట్ పడిపోవడంతో రూ.15 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపనకు గురై ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన కుటుంబలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.