మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పిటిసి మురళిదర్ వైసీపీ పార్టీకి, జడ్పిటిసి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ లు రాజీనామా చేశారు. వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు మరో ఏడు మంది సర్పంచులు రాజీనామా చేశారు. పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు నాయకులు.