AP: వైసీపీకి వరుస షాకులు తగుతున్నాయి. కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓటమి తర్వాత కన్నబాబుకు వైఎస్ జగన్ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన మాత్రం క్రియాశీలకంగా పని చేయలేదని సమాచారం. వైసీపీకి భవిష్యత్ లేకపోవడంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.