AP: తల్లికి వందనం పథకం కింద తల్లుల బ్యాంక్ అకౌంట్‌లో ప్రభుత్వం రూ.13 వేల చొప్పున నగదు జమ చేస్తోంది. అయితే ఒకటో తరగతిలో చేరేవారికి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేవారికి మాత్రం ఇంకా డబ్బులు జమ చేయలేదు. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. వచ్చే నెలలో వారికి డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి, అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకు నగదు జమ కాలేదు. వీరికి ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత నిధులు విడుదలవుతాయి.