ఏపీ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాల మేరకు జాయింట్ సెక్రటరీ విజయరాజును అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ కార్యాలయానికి విజయరాజు లేఖ రాసిన విషయం నిజమేనంటూ ప్రభుత్వానికి నివేదిక అందింది. దీంతో గవర్నర్ సైతం చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.