ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుపై ప్రజల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారట. అయితే దీనికి వాలంటీర్ల సేవలు వినియోగించుకునే అవకాశంపై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులను రంగంలోకి దింపితే అసలైన ప్రజల అభిప్రాయాలు వ్యక్తం కాకపోవచ్చని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. భౌతిక సర్వేల కోసం వాలంటీర్లను రంగంలోకి దింపితే బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.