AP: రాష్ట్రవ్యాప్తంగా మన్యం ప్రాంతాల బంద్‌కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఐదో షెడ్యూల్ ఏరియాలో టూరిజం అభివృద్ధి చెందాలంటే గిరిజనుల ఉనికి కోసం రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని సడలించాలన్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా చట్టాన్ని సడలించడం ఏంటని జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 12న జరిగే రాష్ట్రవ్యాప్త మన్యం బంద్‌లో గిరిజనులు పాల్గొనాలని కోరారు.