ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. రేపు ఉ.11 గంటలకు భేటీ కానుంది. ఏపీకి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలిలో కీలక చర్చ జరగనుంది. ప్రధానంగా వైసీపీ హయాంలో ఫ్రీ హోల్డ్ చేయబడిన 22-ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.