ఏపీలో విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు (హోలిస్టిక్ కార్డులు) ఇవ్వాలని విద్యా శాఖ నిర్ణయించింది. గతంలో ప్రగతి కార్డులు (ప్రోగ్రెస్ కార్డులు) ఇచ్చేవారు. వాటిలో కొన్ని మార్పులు చేసి సమగ్ర ప్రగతి పత్రాలు రూపొందించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని ఇవ్వనున్నారు. విద్యార్థి అభిరుచులు, ఆసక్తులు, విద్యాపరమైన సామర్థ్యాలు, సవాళ్లను ఆరు నెలలకోసారి ఇందులో నమోదు చేస్తారు.