AP: ఈ నెల 19 నుంచి 27 వరకు AP EAPCET పరీక్షలు ప్రారంభం కానున్నాయని ఛైర్మన్ CSRK ప్రసాద్ తెలిపారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62,392 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలు, HYDలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.