ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్‌కు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. డిస్టలరీస్, బ్రూవరీస్ కమిషనర్‌గా నిశాంత్ కుమార్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. తదుపరి ఉత్తర్వుల వరకు నిశాంత్ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది.