ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెన్త్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26 వరకు చెల్లించవచ్చు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 9 వరకు, రూ.500 జరిమానాతో డిసెంబర్ 16 వరకు అవకాశం కల్పించింది.