ఏపీ ప్రభుత్వం మరోసారి అప్పు చేసింది. రిజర్వ్ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు సమీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లు అప్పు తీసుకుంది. ఈ రూ.6 వేల కోట్లతో బడ్జెట్ అప్పులు మొత్తం రూ.80,827 కోట్లకు చేరాయి. తద్వారా ఎనిమిది నెలల్లోనే రికార్డ్ స్థాయిలో కార్పొరేషన్లు, బ్యాంక్‌ల ద్వారా మరో రూ.52 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది.