నగరాలు సామాజికవర్గానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

33చూసినవారు
నగరాలు సామాజికవర్గానికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు సామాజికవర్గానికి బీసీ-డి కింద కులధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పత్రాలు జారీ అవుతున్నప్పటికీ, మరికొన్ని జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని ఆ సామాజికవర్గానికి చెందిన నేతలు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సామాజికవర్గానికి బీసీ-డి కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్