AP: కడప మేయర్ సురేష్ బాబును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. మున్సిపల్ చట్టాలను ఉల్లంఘించి.. రూ. 36 లక్షల అవినీతికి పాల్పడ్డట్లు ఆయన మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి ముందు సురేష్ బాబు హాజరయ్యారు. విచారణల అనంతరం బుధవారం మేయర్‌ను తొలగిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.