ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యజమానుల సమక్షంలోనే భూముల రీ-సర్వే

82చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యజమానుల సమక్షంలోనే భూముల రీ-సర్వే
AP: యజమానుల సమక్షంలోనే భూములను రీ-సర్వే చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు మూడుసార్లు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. అప్పటికీ రాకుంటే వీడియోకాల్‌ ద్వారా ప్రక్రియను పూర్తిచేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో పైలట్‌ ప్రాజెక్టు కింద రీ-సర్వే ప్రారంభిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్