ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కొత్త క్రీడా విధానంపై సమీక్షా సమావేశం అనంతరం ఆమోదం తెలిపింది. అనంతరం నాలుగు లక్ష్యాలతో క్రీడా పాలసీ రూపకల్పన చేసింది.. ‘ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2నుంచి 3శాతానికి పెంచాలని, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతల ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచాలని, ఒలింపిక్స్, ఏషియన్స్ గేమ్స్‌లో పతకాలు పొందేవారికి ప్రోత్సాహకాన్ని పెంచాలి’ అని ప్రతిపాదించింది.