డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉన్నతి పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణాల పరిమితి రూ.5 లక్షలకు పెంచింది. మొన్నటి వరకు ఈ పథకం కింద వారికిచ్చే సున్నా వడ్డీ రుణాల పరిమితి రూ.2 లక్షలు ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా రూ.50 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాన్ని ఇస్తారు.