ఏపీలో ఘోరం జరిగింది. గుంటూరులో గన్ మిస్‌ఫైర్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్.. ప్రస్తుతం గుంటూరులో శృంగేరి పీఠాధిపతి స్వామీజీ విధుశేఖరకు ఎస్కార్ట్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తనతో పాటు ఉన్న కార్బన్ వెపన్ మిస్‌ఫైర్ కావడంతో శ్రీనివాస్‌కు బుల్లెట్ గాయం తగిలింది. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా శ్రీనివాస్ మృతి చెందాడు.