శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే

77చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజే
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ సోమవారం దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశ్వీరచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్