ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్పకి ఈ నెల 20 వరకు రిమాండ్‌

67చూసినవారు
ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్పకి ఈ నెల 20 వరకు రిమాండ్‌
AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో భాగంగా కీలక నిందితుడైన గోవిందప్ప బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవిందప్పను బుధవారం ఏసీబీ కోర్టులో సిట్‌ అధికారులు హాజరుపరిచారు. అయితే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. అనంతరం విజయవాడ జైలుకు తరలించారు. కాగా, ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు కీలక నిందితులు జైలులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్