ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం బనగానపల్లె నుంచి కర్నూలు వైపు ఓ కార్యక్రమం కోసం వెళ్తున్నారు. ఓర్వకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని గమనించి, వెంటనే కాన్వాయ్ ఆపి ఘటనా స్థలానికి వెళ్లారు. క్షతగాత్రుడిని గమనించిన మంత్రి ఆయన కాన్వాయ్‌లోనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వయంగా డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.