AP: వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు

54చూసినవారు
AP: వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకు ఓటు వేయాలంటూ వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేర‌కు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. పంచాయతీరాజ్‌ శాఖలో అసిస్టెంట్‌ సెక్రటరీగా వెంకట్రామిరెడ్డి పనిచేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్