AP: అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేడు జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. స్మగ్లింగ్‌పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆఖరికి పెట్రోల్ కూడా కల్తీ జరుగుతుందన్నారు. ఇలాంటి కల్తీలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని విమర్శించారు.