AP: పాలిసెట్ దరఖాస్తుల గడువును సాంకేతిక విద్యాశాఖ పొడిగించింది. నేటితో ముగిసిన గడువును మరో రెండు రోజులు పెంచింది. ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించింది. టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. ఓసీ, బీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.400 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100 దరఖాస్తు ఫీజుగా ఉంది. ఈ నెల 30న పరీక్ష జరగనుంది.