శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడికి దేశ అత్యున్నత గ్యాలంట్రీ అవార్డుల్లో ఒకటైన ‘కీర్తి చక్ర’ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ గౌరవాన్ని అందుకున్నారు. 2023 అక్టోబర్ 26న జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటును ఎదుర్కొనడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.