సీఎం చంద్రబాబు కృషితోనే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు పెరిగాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ పేర్కొన్నారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోంది. ఎన్నడూ లేనివిధంగా గత 7 నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందించింది. గత ప్రభుత్వం తప్పిదాలతో జల్‌జీవన్ మిషన్‌లో రూ.15వేల కోట్ల నష్టం వచ్చింది. చంద్రబాబు విజ్ఞప్తితో ఆ పథకాన్ని కేంద్రం మరో ఏడాది పొడిగించింది." అని చెప్పారు.