AP: జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నేడు అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను సర్కార్ ఏర్పాటు చేసింది. NHAI, MORTH ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి 12 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.