ఏపీలో స్కూళ్ల టైమింగ్స్‌లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇక నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ హైస్కూళ్లు ఉండనున్నాయి. నూతన టైమ్ టేబుల్‌ను విద్యాశాఖ అమలు చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ నెల 25 నుంచి 30 వరకూ ప్రతి మండలంలో ఒక హైస్కూల్‌ను నూతన టైమ్ టేబుల్‌కు అనుగుణంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విద్యా కమిటీలు, తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు టైమ్ టేబుల్ అమలు చేయనుంది.