ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నేడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించనుందన్నారు. రెండో విడతలో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపారు.