కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్‌గా ఏపీ యువకుడు

77చూసినవారు
కెన్సింగ్టన్ డిప్యూటీ మేయర్‌గా ఏపీ యువకుడు
AP: ప.గో. జిల్లా భీమవరం మండలానికి చెందిన ఆర్యన్ ఉదయ్ ఆరేటి తాజాగా యూకేలోని రాయల్ బరో కెన్సింగ్టన్, చెల్సియా డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తుందుర్రు గ్రామానికి చెందిన ఆరేటి వీరాస్వామి, గొబ్బెళ్లమ్మ మనవడు ఆర్యన్ ఉదయ్. ఇతని తండ్రి వెంకట సత్యనారాయణ భీమవరంలో ఓ విద్యాసంస్థలో ప్రధానాచార్యుడిగా పని చేశారు. ఆర్యన్ ఉదయ్ బ్రిటన్‌లో ఉన్నత పదవి చేపట్టడంపై అతని బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్