AP: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా శుక్రవారం ఏపీలో సెలవు ప్రకటించాలని నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారని, ఏపీలో కూడా హాలిడే ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక మంత్రిగా, రెండు సార్లు ప్రధానిగా దేశానికి ఎంతో చేసిన మన్మోహన్ సింగ్‌కు నివాళి ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు.