డిసెంబర్ 1 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఒకటో తేదీన ఇంటికెళ్లి పింఛను అందించే రాష్ట్రం మనదే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తామన్నారు. పింఛను 2 నెలలు తీసుకోకపోయినా మూడోనెల ఒకేసారి ఇస్తామని స్పష్టం చేశారు.