ఏపీలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు డీమ్డ్ (స్వయం ప్రతిపత్తి) హోదా కోసం ప్రయత్నిస్తున్నాయి. అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ హోదా లభిస్తే సీట్లన్నింటినీ జాతీయస్థాయి ర్యాంకు(నీట్)లతో భర్తీ చేస్తారు. ఇప్పుడు సుమారు 7 ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలు ‘డీమ్డ్ టు బి’ హోదాను UGC నుంచి పొందేందుకు అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీచేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి దరఖాస్తులు పెట్టుకుంటున్నాయి.