AP: కూటమి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యపై ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇంటర్ కళాశాలలను వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభించాల్సి ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్లోనే బ్రిడ్జి కోర్సును అమల్లోకి తెచ్చారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభించగా, 7 నుంచి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.