AP: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబానికి ఇచ్చే అంత్యక్రియల ఖర్చును పెంచింది. మొన్నటివరకు రూ.15 వేలు ఉండగా.. ఇప్పుడు దానిని రూ.25 వేలకు పెంచింది. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు ఊరట లభించింది. కాగా, 2018 నుంచి అంత్యక్రియలకు రూ.15 వేలు ఇస్తూ వచ్చారు. తాజా నిర్ణయంతో ఇకపై వారికి రూ.25 వేల చొప్పున చెల్లిస్తారు.