AP: భవన నిర్మాణ అనుమతుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులపై తాజాగా గైడ్‌లైన్స్ విడుదల చేసింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ కింద భవన నిర్మాణ అనుమతులపై ఏపీ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. గైడ్‌లైన్స్ ప్రకారం.. AP వ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను.. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు జారీ చేయనున్నాయి. అయితే రాజధాని పరిధిలో మాత్రం ఇది అమల్లో ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.