AP: వైసీపీ మాజీ పేర్ని నాని కూటమి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం పార్టీ సమావేశం జరగ్గా.. భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు. 'ఇళ్ల పట్టాలు కొన్న విషయంలో జైల్‌లో ఎందుకు వేయలేకపోయారు? పట్టాలు పంచిన సందర్భంలో నా పక్కన కమిషనర్, ఎమ్మార్వో సునీల్ కూడా వున్నారు. మరి ఆ ఎమ్మార్వోకి తెలియకుండా సంతకం పెట్టకుండా.. పంచిపెట్టామని ఎలా చెప్పారు? ఆ సంతకాలు ఎమ్మార్వో సునీల్‌వి కాదని చెప్పే దమ్ముందా? అని నాని ప్రశ్నించారు.