బెల్లం నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, మినరల్స్ సమృద్ధిగా ఉండటంతో రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. సమ్మర్‌లో ఇది బాడీకి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ను భర్తీ చేస్తుంది. రోజూ బెల్లం నీరు తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలకు ఇది చక్కటి పరిష్కారంగా నిలుస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగే సమయాల్లో బెల్లం నీరు తీసుకోవడం శరీరానికి తేలిక, శక్తినిస్తుంది.