రాపాక వరప్రసాదరావు కేరాఫ్ రాజోలు. ఈ పేరు మారుమోగింది అచ్చంగా 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే. ఎందుకంటే జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆయన త్వరలోనే సీఎం చంద్రబాబుని కలిసి టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.