ఆపరేషన్ సిందూర్ టైంలో నియంత్రణ రేఖ వెంట శత్రువుల గుండెల్లో దడ పుట్టించిన బీఎస్‌ఎఫ్ (BSF) జవాన్లను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసించారు. జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన, జవాన్‌లను కలిసి, ముచ్చటించారు. వారి సేవలను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా పాక్ దాడులను తిప్పికొట్టడంలో సాహసం చూపించిన కానిస్టేబుల్ హర్విందర్ సింగ్‌ను కమెండేషన్ డిస్క్ అవార్డుతో సత్కరించారు.