‘ఆపరేషన్ సిందూర్’కు ఎలా ప్రణాళికలు వేసిందో తెలుపుతూ మరో వీడియోను సోషల్ మీడియాలో భారత సైన్యం షేర్ చేసింది. ‘పహల్‌గామ్ ఉగ్ర దాడితో దేశ ప్రజలలో ఆక్రోశం లావాలా పొంగింది. ఈసారి పాక్‌కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకేఒక ఆలోచన సైనికుల మనసులో ఉంది. ఇది ప్రతీకార చర్య కాదు. బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయం. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌కు తగిన గుణపాఠం’’ అని సైనికులు పేర్కొన్నారు.