వైసీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు

78చూసినవారు
వైసీపీ మాజీ ఎంపీకి చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్‌ జీవీకి భారీ షాక్ తగిలింది. హయగ్రీవ ఫామ్స్‌కు చెందిన రూ.44.74 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) జప్తు చేసింది. విశాఖ హయగ్రీవ భూముల్లో జరిగిన కుంభకోణాన్ని ఈడీ బట్టబయలు చేసింది. ఈ భూముల అమ్మకాల్లో ఎంవీవీ, ఆయన ఆడిటర్ జీవీ, మేనేజింగ్ పార్టనర్ గద్దె బ్రహ్మాజీలు సూత్రధారులుగా ఈడీ తేల్చింది. ప్లాట్లు అమ్మి దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్