నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఏపీ రాజ్‌భవన్‌లో 'ఎట్ హోమ్' కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.