ఏపీలో దారుణం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా రాంపల్లి గ్రామంలో అనుమానంతో భార్యను భర్త హత్య చేశాడు. రాంపల్లి గ్రామానికి చెందిన రామానాయుడికి రామలింగాయపల్లి గ్రామానికి చెందిన శారదకు 18 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని రామానాయుడు అనుమానం పెంచుకున్నాడు. దీంతో రామానాయుడు శారద ఇంట్లో చొరబడి బయటకు అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.