అంబేద్కర్ విగ్రహంపై దాడి.. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు

73చూసినవారు
అంబేద్కర్ విగ్రహంపై దాడి.. ఏపీ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు
విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై దాడి జరగడంపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం నోటీసులు పంపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి లేఖలు రాసింది. వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. నివేదిక సమర్పించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహంపై దాడి జరగడంతో జాతీయ ఎస్సీ కమిషన్‌‌కు వైఎస్ఆర్‌సీపీ ఇటీవల ఫిర్యాదు చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్