AP: అన్నమయ్య జిల్లాలో ఓ అయ్యప్ప భక్తుడిపై అన్యమతస్థుడు దాడి చేయడం స్థానికంగా వివాదానికి దారి తీసింది. మదనపల్లిలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెంకటేశ్ అనే అయ్యప్ప భక్తుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. బైక్ రోడ్డుకు అడ్డంగా ఉందని, కాస్త పక్కకు పెట్టమన్నందుకు జియావుల్ హుక్ అనే వ్యక్తి చొక్కా చింపేసి దాడికి దిగాడు. తోటి భక్తులు దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇన్వాల్ అయ్యి ఆ వ్యక్తితో భక్తులకు క్షమాపణ చెప్పించారు.